Wednesday, May 1, 2024
40 C
Nellore
More
    - Advertisement -

    వైకాపా అరాచక పాలన పోవాలి – ప్రశాంతి రెడ్డి

    స్టార్9లైవ్ – నెల్లూరు
    వైసీపీ ఆరాచక పాలనకు విసుగెత్తిన కోవూరు ప్రజలు స్వచ్చందంగా వచ్చి టిడిపిలో చేరుతున్నారని ఈ పరిణామం ప్రజల్లో వస్తున్న మార్పుకు సంకేతమన్నారు కోవూరు ఎన్డీఏ అభ్యర్ధిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిగారు. మీడియా మీట్లో శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రయోజనాలే టిడిపి,జనసేన,బిజెపి కూటమి ప్రధాన లక్ష్యమన్నారు నిబద్ధతతో సంక్షేమ పధకాలు అమలు చేయడమే కాదు ఆయా పధకాలు అమలు చేసేందుకు కావాల్సిన సంపద సృష్టించడం కూడా ఎన్డీఏ కూటమి లక్ష్యమన్నారు. రాష్టంలో దళితులపై జరుగుతున్న దాడులపై శ్రీమతి వేమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత అయిదేళ్లలో దళితులపై ఆరు వేల కేసులు పెట్టి వేధించిన పాలక పార్టీకి బుద్ధి చెప్పేందుకు దళితులందరు ఏకం కావాలని పిలుపు నిచ్చారు. మే 13 న జరిగే ఎన్నికలలో టిడిపి కూటమి అభ్యర్ధులను గెలిపించి అధికార పార్టీ ఆరాచకాలకు చరమ గీతం పాడాలన్నారు.

    రానున్నది టిడిపి కూటమి ప్రభుత్వమేనని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిగారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి 160 సీట్లు గెలవబోతోందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు నెలజీతాల్లో జరుతున్న జాప్యం ఉండబోదన్నారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు సకాలంలో చెల్లించే విధంగా రాష్ట ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటోందన్నారు.
    ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని డ్రగ్స్ రహిత రాష్టం గా మారుస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన అయిదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలిచ్చి నిరుద్యోగ రహిత రాష్టంగా మార్చే బాధ్యత కూటమి ప్రభత్వం తీసుకుంటోందని శ్రీమతి ప్రశాంతి రెడ్డి హామీ యిచ్చారు. అలాగే తల్లికి వందనం పధకం ద్వారా విద్యార్ధులకు ఏటా 15,000 చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకొంటోందని వెల్లడించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నదాత పధకం ద్వారా రైతులకు ఏడాదికి 20,000 దీపం పధకం ద్వారా ప్రతి గృహిణికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా అందచేస్తామన్నారు. 18 నుండి 59 సంవత్సరాల వయసున్న మహిళలకు ఆడబిడ్డ నిధి ద్వారా నెలకు 15000 యిచ్చి ఆదుకుంటామని అలాగే తమ ప్రభుత్వం మహిళలకు ఆర్ టి సి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోందన్నారు. టిడిపి బిజెపి జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక 50 ఏళ్లు పై బడ్డ బీసీ లకు 4,000 వేల పెన్షన్ యివ్వడమే కాకుండా ప్రస్తుతం 3,000 వేలు యిస్తున్న వృధ్యాప్య పైనషన్ 4,000 వేలకు పెంచుతామన్నారు. ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి పై టిడిపి కూటమి చేస్తున్న పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపు నిచ్చారు

    Latest stories