Thursday, May 2, 2024
29.8 C
Nellore
More
    - Advertisement -

    లాయర్‌ దుస్తుల్లో వచ్చి.. కోర్టులో మహిళపై కాల్పులు..

    స్టార్9లైవ్ – డిల్లి

    దేశ రాజధాని దిల్లీ (Delhi)లో కాల్పులు కలకలం సృష్టించాయి. దక్షిణ దిల్లీలోని సాకేత్‌ కోర్టు (Saket court) ప్రాంగణంలో ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు..

    లాయర్‌ దుస్తుల్లో వచ్చిన దుండగుడు.. మహిళపై నాలుగు రౌండ్లు కాల్పులు (Firing) జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో మహిళ సహా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. కోర్టు ప్రాంగణంలోని పోలీసులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

    సాకేత్‌ కోర్టులోని లాయర్‌ ఛాంబర్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసు విచారణ నిమిత్తం ఆ మహిళ నేడు కోర్టుకు హాజరయ్యారు. ఆమె తన న్యాయవాదితో మాట్లాడుతుండగా.. దుండగుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు..

    Latest stories